Politics18th Nov 03:29 PMSunil Byrisetty1 min read
బీహార్ వెళ్లనున్న చంద్రబాబు, లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా పలువురు బీహార్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేయనున్నారు.