News21st Jun 03:45 PMSunil Byrisetty1 min read

యోగాను విమర్శిస్తే ఉపేక్షించనన్న చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్

యోగాను విమర్శిస్తే ఉపేక్షించనన్న చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'యోగాంధ్ర' కార్యక్రమంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రజల డబ్బు వృథా చేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను చంద్రబాబు తిప్పికొట్టారు. "కొన్ని సందర్భాల్లో కొందరి గురించి మాట్లాడటం కూడా అనవసరం. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది" అని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కలుషితం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. "ఇలాంటి భూతాన్ని ఎలా నియంత్రించాలో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తాం" అని చంద్రబాబు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేస్తుందని, అలాంటి కార్యక్రమాలపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Andhra Pradesh news
visakhapatnam
Yoga Andhra
Cm chandra babu
Ys jagan
యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేస్తున్నారన్న జగన్
Scroll for the next article