News31st Aug 12:12 PMSunil Byrisetty1 min read
వెలిగొండకు వెలుగందించిన చంద్రుడు!
కరవు కోరల్లో నలిగిన పశ్చిమ ప్రకాశం రైతులకు జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎట్టకేలకు కలల రూపం దాల్చింది. 1996లో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మళ్లీ తన
కరవు కోరల్లో నలిగిన పశ్చిమ ప్రకాశం రైతులకు జీవనాడి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎట్టకేలకు కలల రూపం దాల్చింది. 1996లో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మళ్లీ తన చేతుల మీదుగా తొలి దశను జాతికి అంకితం చేసే స్థాయికి తీసుకురావడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇది ఏపీ సాగునీటి రంగంలో కీలక మైలురాయిగా చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యం నేడు సాకారమైంది. నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సొరంగాలను తవ్వి కృష్ణా జలాలను తరలించే ఈ ప్రాజెక్టును పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ముందుకు నడిపించారు. నిధుల కొరతను అధిగమించారు. రెండేళ్లలోనే రూ. 2,250 కోట్లకు పైగా వెచ్చించి మొదటి దశ పనులను శరవేగంతో ముగించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే మూడో విడత కింద రూ. 250 కోట్ల పరిహారం విడుదల చేశారు. దీని ద్వారా ఇప్పటివరకు మొత్తం 6,206 ముంపు కుటుంబాలకు రూ. 768 కోట్లకు పైగా అందించారు. నల్లమల సాగర్ జలాశయం ద్వారా నీరు పారబోతుండటంతో అటు నిర్వాసితులు, ఇటు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.