News20th Aug 05:47 PMSunil Byrisetty1 min read

దక్షిణాది ప్రగతికి సమష్టి అడుగులు

రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే

దక్షిణాది ప్రగతికి సమష్టి అడుగులు
రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్ 10 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో చర్చించారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం సాధించటమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివరించారు.
Andhra Pradesh
AP CM
Southern Zonal Council
Chandrababu Naidu
South India Development
Amit Shah
Southern States
Economic Development
అమరావతి
బెంగళూరు
చెన్నై
కుప్పం
తమిళనాడు
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article