Politics5th Jul 05:40 PMSunil Byrisetty1 min read
జగన్ పేరెత్తితే కూటమికి భయం
కూటమి నేతలకు మాజీ సీఎం జగన్ అంటే భయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే రైతుల వద్దకు జగన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పర్
కూటమి నేతలకు మాజీ సీఎం జగన్ అంటే భయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే రైతుల వద్దకు జగన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించాలని కూటమి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనసేన, టీడీపీ నేతలు జగన్ పర్యటన రద్దు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కానీ చిత్తూరు జిల్లాకు జగన్ వచ్చి, మామిడి రైతులను కలవడం ఖాయమని చెప్పారు. రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున ప్రజాపోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.