Politics10th Oct 11:44 AMSunil Byrisetty1 min read

చంద్రబాబు సీఎంగా @15 ఏళ్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా 15ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న బాబు తొలిసారి సీఎం పదవిని చేపట్టారు

చంద్రబాబు సీఎంగా @15 ఏళ్లు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా 15ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న బాబు తొలిసారి సీఎం పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయన మూడు సార్లు ఓడిపోయారు. మూడు సార్లు గెలిచారు. పదిహేనేళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. మిగతా కాలం అంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దక్షిణాదిలో ఏపీ వంటి రాష్ట్రాల్లో ఓ రాజకీయ నేత ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల పాటు పని చేయడం అంటే అసాధారణం. దక్షిణాదిలో కరుణానిధి, పుదుచ్చేరి రంగస్వామి తర్వాత చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఈసారి సీఎంగా పదవి కాలం ముగిసే సరికి వారినీ అధిగమిస్తారు. కులమతాలు, ప్రాంతాల రాజకీయంలో కొట్టుమిట్టాడే ఏపీలో చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారంటే.. ప్రజల కోసమే రాజకీయం చేయడం అనే దాన్ని ఆయన మనసా వాచా నమ్ముకున్నారు. చంద్రబాబు ఇమేజ్ అభివృద్ధి.. ఆయన పడే కష్టం.. బాగు చేసే విధానం చూసే అందరూ ఫ్యాన్స్ అవుతారు . అదే ఇమేజ్ ఆయనను ఇంత కాలం రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలబెట్టింది.
Andhra Pradesh
Chandrababu Naidu
Chief Minister
TDP
Political Milestone
Telugu Desam Party
AP Politics
Development
Leadership
చంద్రబాబు 15ఏళ్లు
ఏపీ రాజకీయాలు
సీఎం ఘనత
అభివృద్ధి నాయకుడు
ప్రజా నాయకుడు
Scroll for the next article