News21st Sep 03:34 PMSunil Byrisetty1 min read

టీచర్లపై దాడులా? తోక కత్తిరిస్తా

విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై వైకాపా నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఫేక్‌ పార్టీ అందరినీ ఫేక్‌ అంటే సహించేది లేదన్నారు. ‘‘విజయవాడలో గురువులపై రౌడీలు దాడి

టీచర్లపై దాడులా? తోక కత్తిరిస్తా
విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై వైకాపా నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఫేక్‌ పార్టీ అందరినీ ఫేక్‌ అంటే సహించేది లేదన్నారు. ‘‘విజయవాడలో గురువులపై రౌడీలు దాడి చేస్తున్నారు. టీచర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు తీసుకుంటాం. వైసీపీ చానల్ రిపోర్టర్‌.. టీచర్‌పై దాడి చేశారంటే వైకాపా ఎంత బరితెగించిందో అర్థం చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే సాక్ష్యాధారాలతో నోళ్లు మూయిస్తాం. చట్టబద్ధ ప్రక్రియపై కోర్టుకు వెళ్లొచ్చు.. కానీ దాడులేంటి? ఉపాధ్యాయులపై రౌడీలను ఎగదోయడమేంటి? గత పాలనలో పాలకులే రౌడీయిజం చేశారు.. దారుణాలకు పాల్పడ్డారు. కుప్పం వస్తే నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. దౌర్జన్యాలకు దిగారు. రౌడీయిజం చేసేవారి తోక కత్తిరిస్తాం. రౌడీలు, విధ్వంసకారులను తరిమికొట్టే సత్తా కుప్పానికి ఉంది’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Scroll for the next article