News10th Aug 03:53 PMSunil Byrisetty1 min read

ఎన్నికలెప్పుడొచ్చినా ఎన్డీయేదే గెలుపు

ప్రజలందరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమమైన ‘మీ భూమి- మీ హక్కు’లో ఆయన మాట్లాడారు. ప్ర

ఎన్నికలెప్పుడొచ్చినా ఎన్డీయేదే గెలుపు
ప్రజలందరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమమైన ‘మీ భూమి- మీ హక్కు’లో ఆయన మాట్లాడారు. ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీయే కూటమిదే విజయం ఖాయమని అనిపిస్తోందన్నారు. తాను ఎన్నికల కోసం రాలేదని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వచ్చానని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజలతోపాటు కూటమి పార్టీల్లోనూ జోష్ నింపేలా గెలుపు మనదేనంటూ సీఎం ఉత్సాహపరిచారు.
Andhra Pradesh Politics
Elections
Chandrababu Naidu
NDA
NDA Alliance
Local Body Elections
Mee Bhoomi Mee Hakku
కలిదిండి
ఏలూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎన్నికల ప్రచారం
Scroll for the next article