News21st Apr 12:35 PMSunil Byrisetty1 min read

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి

ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్‌ అనే ఒక ఐటి కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాలు భూమి కేటాయించినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావ

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి
ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్‌ అనే ఒక ఐటి కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాలు భూమి కేటాయించినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీనికి అధికారికంగా భూములు కేటాయించి ఉంటే వెంటనే రద్దు చేయాలని సీపీఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తుందన్నారు. విశాఖపట్నంలో ఐటి కంపెనీలకు భూకేటాయింపులపై పారదర్శకంగా ఉండాలని, వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం టిసిఎస్‌కు ఎకరం రూ.99 పైసలకు 21 ఎకరాలు ప్రభుత్వం అమ్మినట్లుగా ప్రకటించింది. టిసిఎస్‌ ఆ భూముల్లో నిర్మాణాలు పూర్తయ్యేలోగా అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తాయని వార్తలు వచ్చాయన్నారు. కానీ ఉర్సా కంపెనీకి భూములు కేటాయించినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదని పేర్కొన్నారు. ఇది వాస్తవమా కాదా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని, వాస్తవమైతే అంతకన్నా తప్పు మరొకటి ఉండదని అభిప్రాయపడ్డారు. ఐటిలో ఎలాంటి చరిత్ర, అనుభవమూ లేని నిన్న మొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Visakhapatnam
Chandrababu
TCS
Corruption Exposed Vizag Lands
V Srinivasa Rao
సీపీఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
విశాఖపట్నంలో ఐటి కంపెనీ
Scroll for the next article