Farmers19th Sep 12:43 PMSunil Byrisetty1 min read

పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి... అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక

పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి... అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరువు మండలాలను గుర్తించడంతో పాటు ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ప్రతీ నెలా కేంద్రానికి నివేదికలు పంపించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, వ్యవసాయ–ఉద్యాన పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆరు శాఖల నుంచి అందే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని...వర్షపాతం, పంటల సాగు పరిస్థితి, భూగర్భ జలాలు, నేలలో తేమ శాతం, శాటిలైట్ చిత్రాలు, జలాశయాల్లో నీటి నిల్వలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Scroll for the next article