News4th Jun 05:08 PMSunil Byrisetty1 min read
మహానాడుపై పవన్‌తో చంద్రబాబు చర్చ.
ఏపీ క్యాబినెట్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే కూర్చున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాసేపు చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ఏపీ క్యాబినెట్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే కూర్చున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాసేపు చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు మహానాడు గురించి వివరించారు. కడప మహానాడు నిర్వహణపై మంత్రులతోనూ సీఎం చంద్రబాబు చర్చించారు. గతంలో మహానాడు అంటే.. వేడికి చొక్కాలు తడిచిపోయేవని గుర్తు చేసుకున్నారు. ఈసారి మాత్రం మహానాడు ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందన్నారు. కూటమి పట్ల ప్రజాసానుకూలతను మహానాడు చాటిందని సీఎం చంద్రబాబు వివరించారు.