News20th Oct 09:40 AMSunil Byrisetty1 min read
దీపావళి సంబరాల్లో ముఖ్యమంత్రి దంపతులు
సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ బబ్బూరు గ్రౌండ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి శ్రీమతి భువనేశ్వరి తో కలిసి హాజరయ్యా
సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్ బబ్బూరు గ్రౌండ్లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి శ్రీమతి భువనేశ్వరి తో కలిసి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వారం మొందే రాష్ట్రం లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. అందుకు కారణం విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు కావడమేనన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు హామీ ఇచ్చిన, ఇవ్వని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయడం, మూడు నగరాలను నిర్మించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. అందులో హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం కాగా రెండోది అమరావతి రాజధాని నిర్మాణం, మూడోది విశాఖపట్నం టెక్ సిటీ నిర్మాణం అని అన్నారు. ప్రతి మహిళ ఈరోజు సంతోషంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంతేకాకుండా. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా పొందుతున్నారన్నారు. గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధనగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 98 వేల జిఎస్టీ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికీ జిఎస్టి పై అవగాహన ఏర్పడిందన్నారు..
విజయవాడ బీసెంట్ రోడ్డులో స్ట్రీట్ వెండర్స్ తో ముఖ్యమంత్రి భేటీ కావడం నగరానికి ఒక పండుగ కళ వచ్చిందన్నారు.