Politics2nd Mar 07:47 PMSunil Byrisetty1 min read

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్`

ఏపీ మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. మార్చి 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియ

మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్`
ఏపీ మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. మార్చి 8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజులపాటు టైలరింగ్ లో శిక్షణ ఇస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. 1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక చేశామన్నారు. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేపడతామని చెప్పారు. అందుకోసం రూ.255 కోట్ల వ్యయం చేస్తున్నామని, చంద్రన్న పాలనలోనే మహిళా సంక్షేమం సాధ్యమవుతుందని వివరించారు. స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు మంత్రి సవిత పిలుపునిచ్చారు.
AP CM
womens Chandra Babu
ఏపీ సీఎం
మహిళలు చంద్ర బాబు
Scroll for the next article