News19th Aug 03:58 PMSunil Byrisetty1 min read

త్యాగం మీది… అండ మాది!

వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ... నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోస

త్యాగం మీది… అండ మాది!
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ... నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. జూన్ 27న రూ.300కోట్లు అందించిన ప్రభుత్వం.. ముంపు బాధితులకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసన సభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు రూ.200 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటి వరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.518 కోట్లను పరిహారంగా అందించింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్మునూ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని అన్నారు. భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Veligonda Project
Chandrababu Naidu
Compensation
Displaced Families
Project Affected Families
Irrigation Project
Rehabilitation
నిర్వాసితుల సంక్షేమం
రూ.200 కోట్ల పరిహారం
వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ
Scroll for the next article