Politics11th Oct 04:21 PMSunil Byrisetty1 min read

స్థానికం.. కసరత్తు ముమ్మరం!

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ సమావేశం

స్థానికం.. కసరత్తు ముమ్మరం!
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ చేసిన అన్యాయాన్ని వివరించారు. 'జయహో బీసీ...! జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం' పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని.. కలిసి ప్రచారం చేయాలంటూ సీఎం నిర్దేశం చేశారు.
Scroll for the next article