News12th Nov 04:23 PMSunil Byrisetty1 min read

ఐటీ మ్యాన్ టు వాటర్ మ్యాన్.. ‘ఆంధ్రాప్రెన్యూర్స్‌’ను సృష్టించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ లో ‘ఆంధ్రాప్రెన్యూర్స్‌’ (Andhrapreneurs) ఆవిర్భావానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసలైన చోదకశక్తి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభివర్ణించార

ఐటీ మ్యాన్ టు వాటర్ మ్యాన్.. ‘ఆంధ్రాప్రెన్యూర్స్‌’ను సృష్టించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ లో ‘ఆంధ్రాప్రెన్యూర్స్‌’ (Andhrapreneurs) ఆవిర్భావానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసలైన చోదకశక్తి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహం, సమర్థవంతమైన పాలన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విధానాలను రూపొందించడం ద్వారా ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. వివిధ రంగాలకు చేసిన విశిష్ట సేవలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఐటీ మ్యాన్’, ‘సీఈఓ మ్యాన్’గా ఖ్యాతి గడించారని, ఇప్పుడు ‘వాటర్ మ్యాన్’గానూ నిలిచారని ప్రశంసించారు. సామాన్య ప్రజలను సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు, క్షేత్రస్థాయిలో ఉపాధి, వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న నిరంతర కృషికి ‘ఆంధ్రాప్రెన్యూర్’ అనే పదం నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Scroll for the next article