News9th Jul 11:57 AMSunil Byrisetty1 min read
‘మీ భూమి-మీ హక్కు’లో సీఎం చంద్రబాబు పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించారు. ప్రతి నెల 9వ తేదీన నిర్వహిస్తున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించారు. ప్రతి నెల 9వ తేదీన నిర్వహిస్తున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతుల 2,074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఉత్తర్వులను అందజేయనున్నారు. అలాగే బనగానపల్లె నియోజకవర్గంలోని 23 మంది రైతులకు చెందిన 101 ఎకరాలను చుక్కల భూముల జాబితా నుంచి తొలగించిన ఉత్తర్వులను కూడా రైతులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జులై నెలతో కలిపి 6,887 గ్రామాల్లో 29.04 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టగా, ఈ నెల 428 గ్రామాల్లో 2.48 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 8,412 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.