Telangana8th Jan 05:50 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు రాజీనామా చేయాలి

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటనపై స్పందిం

చంద్రబాబు రాజీనామా చేయాలి
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటనపై స్పందించకపోతే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాయలసీమ హక్కులకు భంగం కలిగించాలని చూస్తే రాజకీయ సమాధికి పునాదిరాయిగా రాయలసీమ ఎత్తిపోతల పథక ఉద్యమం ఊపిరి పోస్తుందని, రాయలసీమ జీవనాడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా 2020 మే నెల 5వ తేదీన 6829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడెల్పు సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జి.ఓ నెం. 203 జారీ చేశారని గుర్తు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విషం చిమ్మిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.
Andhra Pradesh Politics
Chandrababu Naidu
CPI
G Eshwaraiah
Rayalaseema Lift Irrigation Project
Revanth Reddy
తెలంగాణ అసెంబ్లీ
నీటిపారుదల ప్రాజెక్టులు
రాయలసీమ
Scroll for the next article