News20th Apr 06:56 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు టైం ట్రావెలర్!

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ హాల్లో చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హ

చంద్రబాబు టైం ట్రావెలర్!
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ హాల్లో చంద్రబాబు ప్రసంగాల పుస్తకం ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. చంద్రబాబు విజన్‌ను ఎంతటి వ్యతిరేకులైనా అంగీకరించాల్సిందేనని అన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించగల నిజమైన 'టైమ్ ట్రావెలర్' చంద్రబాబు అని అభివర్ణించారు. విదేశాల్లో ఉన్నా కూడా వీడియో, టెలికాన్ఫరెన్సుల ద్వారా రాష్ట్ర వ్యవహారాలను సమీక్షిస్తారని, ఆయన పనితీరు అలాంటిదని వివరించారు. చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరైనా గొప్పగా రాణిస్తారని రఘురామ అన్నారు. విదేశాల్లో ఎంతోమంది విద్యార్థులకు చంద్రబాబు ఆర్థికసాయం చేస్తుంటారని, ఆ విషయం ఎవరికీ తెలియదని పెమ్మసాని తెలిపారు.
Andhra Pradesh
chandrababu
Raghurama Krishna Raju
MP Pemmasani
నిజమైన 'టైమ్ ట్రావెలర్' చంద్రబాబు
Scroll for the next article