News21st Jul 01:19 PMSunil Byrisetty1 min read

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ- అమరావతి డిక్లరేషన్ విడుదల

సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హ

గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ- అమరావతి డిక్లరేషన్ విడుదల
సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగింది. సమ్మిట్‌లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ రంగ నిపుణులు పాల్గొన్నారు. 7 సెషన్స్‌గా జరిగిన సమ్మిట్‌లో గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండిలు చర్చించారు. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఆధారంగా డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు విధివిధానాలు రూపొందించేలా డిక్లరేషన్ రూపొందించారు. ముఖ్యంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
Andhra Pradesh news
Green Hydrogen Declaration
Amaravati Green Hydrogen Summit
chandra babu
Kamalakar Babu
Chief Secretary Vijay Anand
హైడ్రోజన్ వ్యాలీ 2030
గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్
Scroll for the next article