News29th May 11:36 AMSunil Byrisetty1 min read

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

మహానాడు సభ అనంతరం కడప నుంచి సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమం

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మహానాడు సభ అనంతరం కడప నుంచి సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో సీఎం పాల్గొంటారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురిని కలిసే అవకాశం ఉంది. ఈనెల 31న దిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న సీఎం ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. అనంతరం గున్నేపల్లి గ్రామస్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమై సాయంత్రం అమరావతి చేరుకోనున్నారు.
Andhra Pradesh news
delhi
cm Chandra Babu
cii agm meeting
delhi tour
నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సీఎం ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీ
Scroll for the next article