News1st Sep 12:21 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు.
1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించారు. మూ
1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించారు. మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా చంద్రబాబు.. నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి నేటి వరకు సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు. నేటివరకు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు.. అంటే 5,442 రోజులు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలు మార్చారు. నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ.. నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకు చంద్రబాబు రూపకల్పన చేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర.. 2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తున్నారు.