News13th Dec 11:38 AMSunil Byrisetty1 min read

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్
ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా ఈ కేసులో చంద్రబాబుతో పాటు మిగిలిన వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.114 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అప్పటి ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఏ-25గా చేర్చింది. అలాగే అప్పటి ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ వేమూరి హరికృష్ణ, ఎండీ కె. సాంబశివరావు, టెర్రాసాఫ్ట్‌ డైరెక్టర్‌ తుమ్మల గోపాలకృష్ణతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, వాటి ఉన్నతాధికారులను నిందితులుగా పేర్కొన్నారు. కోర్టు తీర్పు వెలువడే సమయంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, వైసీపీ నేత గౌతంరెడ్డి తన వాదనలు వినాలంటూ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
AP FiberNet Case
Chandrababu Naidu
Andhra Pradesh Chief Minister
Clean Chit
ACB Court Vijayawada
CID Case
ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్
అవినీతి ఆరోపణలు
వైసీపీ ప్రభుత్వం
కోర్టు తీర్పు
Scroll for the next article