News7th Jan 11:46 AMSunil Byrisetty1 min read

మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో డిన్నర్ మీటింగ్‌!

సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. సమావేశం తర్వాత తిరిగి అమరావతికి రానున్నారు. ఇంత హడావుడి

మరోసారి ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో డిన్నర్ మీటింగ్‌!
సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. సమావేశం తర్వాత తిరిగి అమరావతికి రానున్నారు. ఇంత హడావుడిగా అమిత్ షాతో సమావేశం ఎందుకనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యవసరమైన రాజకీయపరమైన చర్చల కోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నారని కొంత మంది భావిస్తున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఏపీకి అత్యవసరమైన ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదనలకు.. అమిత్ షాకు సంబంధం లేదు అయితే.. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా అమిత్ చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఆయన చెబితే పనులు జరుగుతాయి. అందుకే చంద్రబాబు ఆయన వద్ద నుంచే ఏపీ ప్రతిపాదనలు పంపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Delhi Visit
Amit Shah
Dinner Meeting
Central Budget
AP Proposals
NDA Government
Political Discussions
Scroll for the next article