News10th Oct 06:07 PMSunil Byrisetty1 min read

నందగోకులం లైఫ్‌ స్కూల్‌ ప్రారంభించిన చంద్రబాబు

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరమ మాట్లాడుతూ సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమా

నందగోకులం లైఫ్‌ స్కూల్‌ ప్రారంభించిన చంద్రబాబు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అక్కడ బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరమ మాట్లాడుతూ సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో నందగోకులం లైఫ్‌ స్కూల్‌కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాంట్‌ను సందర్శించారు. అలాగే.. విశ్వసముద్ర గ్రూప్‌ ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించారు. నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్‌ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు. ఎద్దులతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఎక్కడా లేదని చెప్పారు. పవర్ ఆఫ్ బుల్స్ చాటుతూ.. 5 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని చంద్రబాబు వివరించారు.
Andhra Pradesh
Chandrababu naidu
Nandagokulam Life School
Bio Energy
Ethanol plant
Nellore
Venkatachalam
Vishwasa mudra Group
Renewable Energy
Farmers income
రైతుల ఆదాయం
ప్రకృతి సంరక్షణ
పవర్‌ ఆఫ్‌ బుల్స్
Scroll for the next article