News2nd Jul 11:37 AMSunil Byrisetty1 min read

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం శాంతిపురం మండలం తుంశీలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద బహిరంగ సభకు హాజరుకానున్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1,617 కోట్ల విలువైన పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం తిమ్మరాజుపల్లిలో 'సుపరిపాలనలో - తొలి అడుగు'లో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని సీఎం చంద్రబాబు నిర్వహిస్తారు.
Andhra Pradesh news
Kuppam
cm chandra babu
ap schems
suparipalana
అభివృద్ధి
నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
Scroll for the next article