News9th Apr 08:39 AMSunil Byrisetty1 min read

రాజధానిలో చంద్రబాబు సొంతిల్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్నారు. నేడు సొంతింటి కోసం శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం ప

రాజధానిలో చంద్రబాబు సొంతిల్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో సొంతిల్లు నిర్మించుకోనున్నారు. నేడు సొంతింటి కోసం శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక, ఈ9 రహదారి పక్కన కొంత భూమిని కొనుగోలు చేసిన చంద్రబాబు, కుటుంబ సభ్యులతో కలిసి గృహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత, చంద్రబాబు పాలనను ఇక్కడి నుంచే కొనసాగించారు. అయితే, ఉండవల్లి నివాసంలో ఉంటూ పాలన సాగిస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష వైయస్సార్సీపీ సైతం విమర్శలు చేసింది. తమ పార్టీ అధినేత తాడేపల్లిలో సొంతిల్లు నిర్మించుకుంటే చంద్రబాబు మాత్రం అద్దె ఇంట్లో ఉంటున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఐదెకరాలు కొనుగోలు చేసిన చంద్రబాబు సొంతింటి నిర్మాణం చేపట్టనున్నారు.
CM Chandrababu
Amaravati
New House
foundation stone laying
సీఎం చంద్రబాబు నివాసం
గృహ నిర్మాణానికి భూమి పూజ
Scroll for the next article