News26th Apr 04:08 PMSunil Byrisetty1 min read

బీచ్‌లో బాబు.. మత్స్యకారులతో ముచ్చట!

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామంలోని పలు మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

బీచ్‌లో బాబు.. మత్స్యకారులతో ముచ్చట!
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామంలోని పలు మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మొదట సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. అనంతరం ఎండుచేపలను పరిశీలించి మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న సీఎం...చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.
Srikakulam
Chandrababu Naidu
Matsyakara Sevalo
మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
ఎచ్చెర్ల నియోజకవర్గం
మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం
Scroll for the next article