News27th Jan 04:58 PMSunil Byrisetty1 min read

పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న చంద్రబాబు

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. 25 పార్లమెంట్ కమిటీల ను

పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొన్నారు. 25 పార్లమెంట్ కమిటీల నుంచి 1050 మంది కమిటీ సభ్యులు వర్క్ షాప్ కు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంట్లకు కలిపి 1050 మంది వర్క్ షాప్ లో పాల్గొన్నారు. పార్టీ వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్దాంతాలపై నాయకులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనలు వివరించారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Telugu Desam Party
TDP
Parliament Committee Workshop
NTR Bhavan
Nara Lokesh
పార్టీ విధానాలు
పార్టీ సిద్ధాంతాలు
క్యాడర్ మేనేజ్‌మెంట్
Scroll for the next article