News16th Oct 04:30 PMSunil Byrisetty1 min read

మోదీలాంటి నాయకుడిని చూడలేదన్న చంద్రబాబు

ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ సభలో ఆయన మాట్లాడారు. మనందరి భవిష్యత్ కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం

మోదీలాంటి నాయకుడిని చూడలేదన్న చంద్రబాబు
ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ సభలో ఆయన మాట్లాడారు. మనందరి భవిష్యత్ కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని చెప్పారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పారు. 'సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీ. చాలా మంది ప్రధానులతో కలిసి పని చేశా. కానీ, మోదీ లాంటి నాయకుడిని చూడలేదు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది' అని అన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Narendra Modi
Kurnool
Super GST
Super Savings
GST Reforms
Public Meeting
Leadership
India 2047
Economic Growth
Telugu Politics
Visionary Leader
BJP
TDP
Scroll for the next article