News9th Oct 02:42 PMSunil Byrisetty1 min read

బీసీలకు 34 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషనల్ కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా నర్సింగోలులో 'మీ భూమి-మీహక్కు' గ్రామ సభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగ

బీసీలకు 34 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు
స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషనల్ కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా నర్సింగోలులో 'మీ భూమి-మీహక్కు' గ్రామ సభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 24 శాతం రిజర్వేషన్లను నేను 34 శాతానికి పెంచానన్నారు. గత ప్రభుత్వం మళ్లీ 24 శాతానికి తగ్గించారని, 16,800 మందికి స్థానిక సంస్థల్లో నాయకత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామన్నాం.. ప్రయత్నించామని పేర్కొన్నారు. 50 శాతానికంటే రిజర్వేషన్లు పెరుగుతున్నాయంటూ వైసీపీ కోర్టుకెక్కిందన్నారు. మేము రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి రిపోర్టు తెప్పించామని వివరించారు.ఎన్ని ఇబ్బందులైనా బీసీలను ఆదుకుంటామని, వెనుకబడిన వర్గాలు బాగుపడితే టీడీపీ బలపడుతుందని అన్నారు. తప్పకుండా 34 శాతంకంటే ఎక్కువ సీట్లు పార్టీపరంగా ఇస్తామని, బీసీలు టీడీపీకి వెన్నెముక.. బీసీలకు అండగా నిలబడటం తన కర్తవ్యమని సీఎం వివరించారు.
Scroll for the next article