News25th Jun 10:59 AMSunil Byrisetty1 min read
రాజధానికి బంగారు గాజులు విరాళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి చేయందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. రాజధాని బాగుండాలంటూ ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి 36 గ్రాము
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి చేయందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. రాజధాని బాగుండాలంటూ ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులతో పాటు రూ.1 లక్ష చెక్కును విరాళంగా సీఎం చంద్రబాబుకు అందించారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేల విరాళం ఇచ్చారు. వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని సీఎం అభినందించారు.