News25th May 10:12 AMSunil Byrisetty1 min read
చంద్రబాబుపై ప్రశంసల వర్షం
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపి సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై ఏపి సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు.
విశాఖకు గ్లోబల్ హంగులు అద్దేలా నాలుగు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు వివరించారు.
విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం, కర్నూలులో డ్రోన్ సిటీ ప్లాన్ తదితరాలను వివరించారు.
అలాగే దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్‌లో చంద్రబాబు ప్రస్తావించారు.
సీఎం ప్రజెంటేషన్‌లో వివిధ అంశాలు వికసిత్ భారత్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.
ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు.
చంద్రబాబుపై నీతి ఆయోగ్ లో ప్రశంసల వర్షం కురిసింది.