News15th Dec 12:51 PMSunil Byrisetty1 min read
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అధినేత చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం రానున్నారు. త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జిల్లాల కమిటీలపై టీడీపీ అధిష్టానం ఓ క్లారిటీకి రానుంది. సంస
టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం రానున్నారు.
త్రిసభ్య కమిటీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జిల్లాల కమిటీలపై టీడీపీ అధిష్టానం ఓ క్లారిటీకి రానుంది. సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. జిల్లా కమిటీల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తి చేయడంతో వాటిపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ ఎంపికపైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రానున్నట్లు సమాచారం. పార్టీ కమిటీలపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.