News1st Sep 01:42 PMSunil Byrisetty1 min read

దార్శనికుడు..అలుపెరుగని శ్రామికుడు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన ఈ రోజు కీలక ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజుతో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3

దార్శనికుడు..అలుపెరుగని శ్రామికుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన ఈ రోజు కీలక ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజుతో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లన్నారు. నాటి నుంచి నేటి వరకూ అలుపెరుగని శ్రామికుడిగా ఆయన పనిచేస్తూ, చేయిస్తూ, ఉమ్మడి ఆంధ్రాలోనూ, నవ్యాంధ్రలోనూ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ముఖ్యంగా ఆయన దార్శినికత, పాలన విషయమై ఉండే నిబద్ధత అన్నవి ఇప్పటి నాయకులకు స్ఫూర్తి అని చెప్పారు. నా రాజకీయ జీవితానికి ఆయనొక స్ఫూర్తి అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సాంకేతికతను అందుకుని పరుగులు తీయడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో పాలన పరం అయిన సంస్కరణలు అమలు చేసి గొప్ప విజన్ ఉన్న నేతగా ఆయన పేరు చరిత్రలో నిలిచి పోయిందని ప్రశంసించారు.
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Achchennaidu
Visionary Leader
Political Legacy
Governance
Reforms
Technology in Politics
అచ్చెన్నాయుడు
దార్శనిక నాయకుడు
Scroll for the next article