News19th Jul 10:50 AMSunil Byrisetty1 min read

రాజధాని, బనకచర్ల బాబు చేసేనా!

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వర్కవుట్ అవుతుందా? ఐదేళ్ల పాటు ఆయన చేసిన పనులు కొనసాగిస్తే అద్భుతాలవుతాయి. హైదరాబాద్ విషయంలో అదే జరిగింది. కానీ అమరావతి, పోలవరం విషయంలో జరగలేదు. జగన్ తర

రాజధాని, బనకచర్ల బాబు చేసేనా!
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వర్కవుట్ అవుతుందా? ఐదేళ్ల పాటు ఆయన చేసిన పనులు కొనసాగిస్తే అద్భుతాలవుతాయి. హైదరాబాద్ విషయంలో అదే జరిగింది. కానీ అమరావతి, పోలవరం విషయంలో జరగలేదు. జగన్ తర్వాత ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి వాటిని పూర్తి స్థాయిలో దారిలో పెట్టక ముందే వేరే ప్రాజెక్టులను ప్లాన్ చేసేస్తున్నారు. అయితే వాటి సంగతి తర్వాత ముందు ప్రారంభించిన పని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. అమరావతి రెండో దశకు చంద్రబాబు అప్పుడే ప్లాన్ చేశారు. ఎయిర్ పోర్టు కూడా అంటున్నారు. మొదటి దశలో భూములు ఇచ్చిన వారికి ఆశించిన ఫలితం వచ్చేలా చేయాలి. ఆ తర్వాతే రెండో దశ చేపడితే రైతులు అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు వస్తారు. పోలవరమే ఓ మెగా ప్రాజెక్టు అనుకుంటే దాని తాత లాంటి బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు నెత్తికెత్తుకుంటున్నారు. ముందు పోలవరాన్ని పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బనకచర్ల గురించి ఆలోచించాలి.
Andhra Pradesh news
amaravati
Chandrababu Naidu
ys jagan
Banakacherla Project
Polavaram
Amaravati Development
అమరావతి రెండో దశకు చంద్రబాబు ప్లాన్
Scroll for the next article