News4th Sep 09:30 AMSunil Byrisetty1 min read
జీఎస్టీ తగ్గింపుపై చంద్రబాబు ట్వీట్!
జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్
జీఎస్టీ స్లాబ్ ల తగ్గింపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని సీఎం అన్నారు. ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకంగా మారుతుందన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందనీ పేర్కొన్నారు. విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అభినందనలు తెలియచేస్తున్నాననీ ట్వీట్ లో పేర్కొన్నారు. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతీ భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు.