Politics6th Mar 04:05 PMSunil Byrisetty1 min read

చరిత్ర అంటే గతం కాదు... భవిష్యత్ కు దిక్సూచి

‘విశాఖలో నేడు మా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెం

చరిత్ర అంటే గతం కాదు... భవిష్యత్ కు దిక్సూచి
‘విశాఖలో నేడు మా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి పాల్గొన్నాను. ఎంతో అధ్యయనంతో రచయిత ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. చరిత్ర అంటే గతం కాదు. చరిత్ర అంటే మన భవిష్యత్ కు దిక్సూచి అని నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి చరిత్ర, వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే వారికి చరిత్ర తెలిస్తే.. ప్రజల భవిష్యత్ ను మార్చే నిర్ణయాలు తీసుకోగలరు. బాధ్యతతో ఉండి ప్రజలకు మంచి చేయగలరు. అటువంటి చరిత్ర గురించి చెప్పే గొప్ప పుస్తకాన్ని తెచ్చిన వెంకటేశ్వరరావుకి, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఎంపి పురందరేశ్వరికి అభినందనలు తెలుపుతున్నాను. ఎన్నో పుస్తకావిష్కరణలకు, కార్యక్రమాలకు హాజరైనా.. ఈ రోజు మా కుటుంబ సభ్యుల్లో విశిష్ట వ్యక్తిగా ఉన్న వెంకటేశ్వరావు రాసిన పుస్తకావిష్కరణలో పాల్గొనడం నాకు మిక్కిలి సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది.
CBN LIVE FROM VISAKHA
DAGGUBATI VENKATESWARA RAO BOOK
సీఎం చంద్రబాబు
ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ
Scroll for the next article