Farmers27th Sep 05:28 PMSunil Byrisetty1 min read

లక్షా 34 వేల మంది రైతులకు రాయితీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు

లక్షా 34 వేల మంది రైతులకు రాయితీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఆయన ప్రజంటేషన్ ఇచ్చి మాట్లాడుతూ అనేక పంటలకు మద్దతు

లక్షా 34 వేల మంది రైతులకు రాయితీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు
లక్షా 34 వేల మంది రైతులకు రాయితీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఆయన ప్రజంటేషన్ ఇచ్చి మాట్లాడుతూ అనేక పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. ఆక్వా రైతులకు రూ.990 కోట్లు రాయితీ ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. చిన్న తప్పు కూడా జరగకుండా మెగా డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడం మా ప్రభుత్వానికి టాప్‌ ప్రయారిటీ అని చెప్పారు. రైతులకు అండగా ఉండేందుకే అన్నదాత సుఖీభవ తెచ్చామని, రాష్ట్రం తరఫున మూడు విడతల్లో రైతుకు రూ.14 వేలు ఇస్తున్నామని వివరించారు. అన్నదాత సుఖీభవ కింద 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Farmers Welfare
Drip Irrigation
Subsidy
Aqua Farmers
Annadata Sukhibhava
Farmer Aid
రైతు పథకాలు
46.85 లక్షల రైతులు
14 వేల రూపాయల సహాయం
Scroll for the next article