News10th Aug 03:50 PMSunil Byrisetty1 min read
పట్టాదారు పాస్ పుస్తకాలపై ఇతరుల ఫొటోలా?
కలిదిండి ‘మీ భూమి- మీ హక్కు’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'గొడ్డలి పార్టీ' కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తోంది అంటూ వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశా
కలిదిండి ‘మీ భూమి- మీ హక్కు’ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'గొడ్డలి పార్టీ' కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తోంది అంటూ వైసీపీపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. “151 సీట్లు వచ్చినా ఏమైంది..?” అంటూ గత పాలనపై సెటైర్లు.. ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ప్రజలు తీర్పు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.. "2019–24లో భూ రికార్డులు ధ్వంసమయ్యాయి.. ఇష్టంలేని వారి భూములను 22ఏలో పెట్టార"ని ఆరోపించారు. "41 వేల ఎకరాలను 22ఏ నుంచి తొలగించి, 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామ’’ని స్పష్టం చేశారు. “పట్టాదారు పాస్ పుస్తకాలపై ఇతరుల ఫోటోలు ఎలా వేసుకుంటారు..?” అంటూ గత పాలకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.