Politics9th Sep 03:57 PMSunil Byrisetty1 min read
మూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే.. అరెస్టుసై చంద్రబాబు
వైసీపీ పార్టీ పాలకులు మూడేళ్ల క్రితం అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. పి. గన్నవరంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ మూడేళ్ల క
వైసీపీ పార్టీ పాలకులు మూడేళ్ల క్రితం అన్యాయంగా అరెస్టు చేసిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. పి. గన్నవరంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం సెప్టెంబరు 9 తేదీన అరెస్టు చేశారన్నారు. ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు.
"48 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. 31 ఏళ్ల క్రితం తొలిసారి సీఎం అయ్యాను.
విలువలతో కూడిన రాజకీయం చేయాలని.. పేద ప్రజలకు, తెలుగు జాతికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. చాలా మంది నాపై ఆరోపణలు చేశారు. కోర్టులకు వెళ్లారు. నాపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయలేక పోయారు... అదే నా నిబద్ధత" అని వివరించారు. నంద్యాలలో ఓ సమావేశానికి వెళ్లిన నన్ను అరెస్టు చేస్తామని అర్ధరాత్రి వచ్చారని, ఉన్న పళంగా అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారని గుర్తు చేసుకున్నారు. గత పాలకులు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేశాయని, ఈడీ లాంటి సంస్థలు కూడా ఇందులో ఏమీ లేదని తేల్చిందని పేర్కొన్నారు.