Politics1st Sep 05:13 PMSunil Byrisetty1 min read

అసెంబ్లీలో చర్చకు వైసీపీ సిద్ధమా? చంద్రబాబు సవాల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీకి సూటి సవాల్ విసిరారు. “సిద్దం సిద్దం” అని నినాదాలు చేసిన వారికి నేను సవాల్ విసురుతున్నాను. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధి,

అసెంబ్లీలో చర్చకు వైసీపీ సిద్ధమా? చంద్రబాబు సవాల్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీకి సూటి సవాల్ విసిరారు. “సిద్దం సిద్దం” అని నినాదాలు చేసిన వారికి నేను సవాల్ విసురుతున్నాను. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధి, సంక్షేమం ఎవరు అందించగలరో చర్చిద్దాం” అని ప్రకటించారు. వైసీపీ వేసే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని చెప్పారు. బాబాయ్ హత్య, పులివెందుల-ఒంటిమిట్ట ఎన్నికలు, దళిత డ్రైవర్‌పై దాడి, కోడికత్తి డ్రామా, గులకరాయి ఘటనలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. “క్లైమోర్ మైన్లతో పేల్చినా నేను చలించలేదు... నేను మీలాగే డ్రామాలు ఆడను” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
AP Politics
Chandrababu Naidu
YSRCP Challenge
Assembly Debate
Development vs Destruction
పులివెందుల ఎన్నికలు
దళిత డ్రైవర్‌పై దాడి
కోడికత్తి ఘటన
Scroll for the next article