News2nd Aug 03:28 PMSunil Byrisetty1 min read

సకాలంలో పన్నుల్లో వాటా.. అభివృద్ధికి ఊతం

*అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10

సకాలంలో పన్నుల్లో వాటా.. అభివృద్ధికి ఊతం
*అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతుందన్నారు.
Andhra Pradesh
N Chandrababu Naidu
Narendra Modi
Nirmala Sitharaman
Tax Devolution
Central Funds
కేంద్ర నిధులు
అదనపు నిధులు
రాష్ట్ర అభివృద్ధి
ఏపీ ప్రభుత్వం
ఆర్థిక సహాయం
Scroll for the next article