News21st Mar 01:23 PMSunil Byrisetty1 min read

వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా

రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదాన

వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా
రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్‌కు వచ్చే నిధులు పగడ్బంధీగా ఖర్చు చేస్తాం. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం వేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఇప్పటికి విరాళాల ద్వారా రూ.2,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటైంది. గతంలో నాపై 24 క్లేమోర్‌మైన్స్ పేల్చారు. అన్ని క్లేమోర్స్ పేల్చినప్పుడు నేను ప్రాణాలతో బతికేవాడిని కాదు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారు. వేంకటేశ్వరస్వామి మహిమ వల్లే బతికాన’ని చంద్రబాబు వివరించారు.
Tirumala
Chandrababu
వేంకటేశ్వరస్వామి
Scroll for the next article