News6th Oct 01:34 PMSunil Byrisetty1 min read

ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంపై కీలక చర్చ జరిగింది. టీడీపీ, జనసేన సమన్వయానికి కమిటీ ఏర్పాటు యోచన చేశారు. కూటమి వంద శాతం గెలుప

ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంపై కీలక చర్చ జరిగింది. టీడీపీ, జనసేన సమన్వయానికి కమిటీ ఏర్పాటు యోచన చేశారు. కూటమి వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. బలమున్న చోట మిత్రపక్షాలు పోటీ చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో పార్టీల బలాబలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టీడీపీ-జనసేన సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో విభేదాలకు పోకుండా.. టీడీపీ-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కూటమి ఐక్యతపై నేతలు, కార్యకర్తలకు.. స్పష్టమైన సందేశం ఇవ్వాలని చంద్రబాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యేందుకు ఉండ‌వ‌ల్లి నివాసానికి వ‌చ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. కారు వ‌ద్ద‌కు వ‌చ్చిన లోకేష్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆత్మీయంగా హ‌త్తుకుని, క‌ర‌చాల‌నం చేసి, ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంత‌రం సీఎం , డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు.
Scroll for the next article