News19th Aug 01:20 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు ముందుచూపు వల్లే ఏలేరు ఆయకట్టుకు నీరు

ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు, తాగు నీటి సరఫరా పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి ని

చంద్రబాబు ముందుచూపు వల్లే ఏలేరు ఆయకట్టుకు నీరు
ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు, తాగు నీటి సరఫరా పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అసెంబ్లీలో యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సూచనలతో ఇటీవలే అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టామని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు నీరందించాలనే ముందుచూపుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీంను నిర్మించారని పేర్కొన్నారు. సూపర్ ఎల్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ 53 వేల ఎకరాల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Yeleru Reservoir
Yeleru Ayacut
Nimmala Ramanaidu
సాగునీరు
తాగునీరు
నీటిపారుదల
వ్యవసాయం
పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీం
పోలవరం ప్రాజెక్టు
పుష్కర ఆయకట్టు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
Scroll for the next article