News27th Sep 04:52 PMSunil Byrisetty1 min read
కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం
కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప
కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవంద్రప్ప, ఆ సామాజిక వర్గీయులు కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కురుబలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో నిలిపేలా కురుబలను ప్రోత్సహిస్తున్నారన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కురుబలకు అధిక ప్రాధాన్యమిచ్చారని, ఎంపీలుగా ఇద్దరిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించారని తెలిపారు. కేబినెట్ లో కూడా బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ బాధ్యతలు కురుబ సామాజిక వర్గానికి చెందిన తనకు అప్పగించారని తెలిపారు. ఈ పదవుల కేటాయింపే కురుబలపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. కురుబల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు.