News31st Aug 11:45 AMSunil Byrisetty1 min read

చంద్ర‌బాబు నయా ట్రెండ్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏ జిల్లాలో కార్యక్రమం నిర్వహించినా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్క‌డికి వెళ్తే అక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవు

చంద్ర‌బాబు నయా ట్రెండ్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఏ జిల్లాలో కార్యక్రమం నిర్వహించినా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్క‌డికి వెళ్తే అక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. గతంలో ఆయన ప్ర‌జ‌ల‌తో కేవ‌లం ముచ్చ‌ట్ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యేవారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా కొంత సమయం కేటాయించి ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ష‌న్‌ అవుతున్నారు. వారితో క‌లిసి, వారి ప‌క్క‌న కూర్చుని.. క‌లివిడిగా ఉంటున్నారు. ప్రతి నెలా 1వ తారీకున పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా పాల్గొంటున్నారు. నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి.. వారితో ముచ్చ‌టించి క‌ష్ట‌సుఖాలు తెలుసుకుంటున్నారు. అలాగే ఏ ప‌ని మీద ఎక్క‌డికి వెళ్లినా.. ఆర్టీసీ బ‌స్సు ఎక్కి, ప్రయాణికులతో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, పాల‌న‌, పెట్టుబ‌డుల‌పై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
TDP
New Trend
Public Interaction
Welfare Programs
Pension Distribution
People Connect
ప్రజలతో సమన్వయం
ప్రాంతీయ అభివృద్ధి
Scroll for the next article