News24th Aug 04:07 PMSunil Byrisetty1 min read
సోషల్ మీడియా మంత్రంతో ఆకట్టుకోవాలి!
దేశంలో కాక్రోచ్ పార్టీ, నేపాల్ లో యువత ఉద్యమం, జెన్ జీ దూకుడును అంచనా వేసిన సీఎం చంద్రబాబు యువతను ఆకట్టుకునే ఆలోచన చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేల యాక్టివిటీపై ఆర
దేశంలో కాక్రోచ్ పార్టీ, నేపాల్ లో యువత ఉద్యమం, జెన్ జీ దూకుడును అంచనా వేసిన సీఎం చంద్రబాబు యువతను ఆకట్టుకునే ఆలోచన చేస్తున్నారు. సోషల్ మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేల యాక్టివిటీపై ఆరా తీశారు. మంత్రుల్లో కొంతమంది.. అదీ నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వంగల పూడి అనిత, ఫరూక్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే యాక్టివ్గా ఉంటున్నారని తెలుసుకుని మిగిలిన వారికి క్లాస్ తీసుకున్నారు. పనులు చేస్తే చాలదని, వాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియా ద్వారా యువతకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఫేస్బుక్, ఇన్ స్టా, వాట్సాప్, ఎక్స్ ఇలా అన్నింటినీ ఉపయోగించాలని సూచించారు. రాబోయే రెండు మూడేళ్లలో యువత ఓటు బ్యాంకు పెరుగుతోందని, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటేనే యువత మనల్ని గుర్తిస్తారని పేర్కొన్నారట.