News28th Sep 03:17 PMSunil Byrisetty1 min read

బీసీలకు చంద్రన్న భరోసా

బీసీలకు చంద్రన్న భరోసా కల్పిస్తుంటే.. జగన్ పాలనలో బీసీలకు ద్రోహం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలను అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు

బీసీలకు చంద్రన్న భరోసా
బీసీలకు చంద్రన్న భరోసా కల్పిస్తుంటే.. జగన్ పాలనలో బీసీలకు ద్రోహం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో బీసీ వర్గాలను అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ‘‘ఐదేళ్ల పాటు జగన్‌రెడ్డి చేసిన అకృత్యాల నుంచి బలహీనవర్గాలను బయటకు తీసుకొచ్చి, వారిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. బీసీలను మళ్లీ మోసం చేసేందుకు గొడ్డలి పార్టీ నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. నాడు స్వర్గీయ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లారు. నేడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగిస్తోంది’’ అని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
Scroll for the next article